ఒక్క రోజులోనే కోటి కోవిడ్ వ్యాక్సిన్ లు – పూర్తి మోతాదులో సగం మార్కు దాటి : రాష్ట్రాల వద్ద నిల్వలు..!! | Half of the eligible population in the country is now fully vaccinated, with over 1.03 crores being administered on Saturday

వ్యాక్సినేషన్ పైన ప్రత్యేకంగా ఫోకస్

వ్యాక్సినేషన్ పైన ప్రత్యేకంగా ఫోకస్

ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న పరిస్థితుల్లో కేంద్రం..రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసాయి. వ్యాక్సిన్లు తీసుకొని వారి పైన ఒత్తిడి పెంచుతున్నాయి. ఫలితంగా.. బీహార్ (15.33 లక్షలు), తమిళనాడు (14.84 లక్షలు), రాజస్థాన్ (10.8 లక్షలు) మరియు ఉత్తరప్రదేశ్ (10.24 లక్షలు)లో శనివారం 10 లక్షలకు పైగా వ్యాక్సినేషన్ అందించారు. ఇప్పటికే సీనియర్ సిటిజన్స్ లో 85 శాతం మంది తొలి డోసు తీసుకోగా, దేశ వ్యాప్తంగా 50.35 శాతం మంది రెండు డోసులను తీసుకున్నారు.

30 జిల్లాల పైన కేంద్రం ఆందోళన

30 జిల్లాల పైన కేంద్రం ఆందోళన

అయితే, 30 జిల్లాలకు పైగా పెరుగుతున్న సంఖ్యలు, ఆరోగ్య మంత్రిత్వ శాఖకు కొంత ఆందోళన కలిగించేలా ఉన్నాయి. దీంతో..ఐదు రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ మరియు కాశ్మీర్‌ను హెచ్చరించింది. నవంబర్ 26తో పోలిస్తే డిసెంబర్ 3తో ముగిసే వారంలో కొత్త కేసులు పెరిగినట్లు తమ జిల్లాల్లో నివేదించడంపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, మిజోరాం. జమ్ములకు జమ్ముకు లేఖ రాశారు. ఇదే సమయంలో కేంద్రం అయిదు నిర్ధిష్టమైన అంశాలను పాటించాలని సూచిస్తూ రాష్ట్రాలకు లేఖలు రాసింది.

ఆ రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ

ఆ రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ

అంతర్జాతీయ ప్రయాణికులపై మెరుగైన నిఘా ఉంచాలని సూచించింది. హాట్‌స్పాట్‌ల పర్యవేక్షణ కొనసాగించాలి. 14 రోజుల పాటు సమగ్ర కాంటాక్ట్-ట్రేసింగ్ తో పాటుగా పర్యవేక్షణ చేయాలని నిర్దేశించింది. తగిన పరీక్ష ద్వారా కేసులను ముందస్తుగా గుర్తించడం తో పాటుగా మరియు ఆరోగ్య మౌలిక సదుపాయాల సంసిద్ధతను సమీక్షించాలని సూచించింది. కేరళలో, తిరువనంతపురం (11.61%), వాయనాడ్ (11.25%), కోజికోడ్ (11%) మరియు కొట్టాయం (10.81%) 10% కంటే ఎక్కువ పాజిటివ్ రేటుతో ఉన్నాయి.

రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖలు

రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖలు

కర్ణాటకలో నాలుగు జిల్లాల లెక్కల పైన కేంద్రం హెచ్చరికలు చేసింది.తుమకూరు, 116 కొత్త కేసులు; ధార్వాడ్, 185; బెంగళూరు అర్బన్, 1,424; మరియు మైసూరు, 219. నవంబర్ 25తో ముగిసిన వారంలో బెంగళూరు అర్బన్‌లో ఎనిమిది మరణాలు నమోదైతే, డిసెంబర్ 2తో ముగిసిన వారంలో 14 మరణాలు సంభవించాయని భూషణ్ నోట్ లో ప్రస్తాంవించారు. జమ్మూ & కాశ్మీర్ గురించి, నాలుగు జిల్లాల్లో వారంవారీ కేసుల పెరుగుదలను కేంద్రం గుర్తించింది. తమిళనాడులో, మూడు జిల్లాల్లో వారంవారీ పెరుగుదల కనిపిస్తోంది: వెల్లూరు (128); తిరువళ్లూరు (136); చెన్నై లో (981) కేసులు నమోదయ్యాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com
Follow by Email
WhatsApp