ఒడిశా వైపు రైళ్లు రద్దు – దారి మళ్లింపు : ఈ రోజుకు అటు ప్రయాణాలు లేనట్లే : ఎఫెక్ట్ వీటి పైనే..!! | Jawad Cyclone: South Central railway cancelled and diverted many trains in Bhubaneswar route

రద్దు చేసిన రైళ్లు ఇవే

రద్దు చేసిన రైళ్లు ఇవే

జొవాద్‌ తుఫాను తీవ్రత దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఆదివారం పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో 5న (ఆదివారం) బయలుదేరాల్సిన భువనేశ్వర్‌- సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (17015), పూరి- తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ (17479), పలాస -విశాఖపట్నం (18531), కిరండోల్‌- విశాఖపట్నం (18552), తిరుపతి -హౌరా ఎక్స్‌ప్రెస్‌ (20890), భువనేశ్వర్‌-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (22819), భువనేశ్వర్‌-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ (22871), హౌరా-తిరుచిరాపల్లి ఎక్స్‌ప్రెస్‌ (12663), భువనేశ్వర్‌ – బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ (12845) రైళ్లు రద్దు చేసినట్టు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది.

దారి మళ్లించిన రైళ్ల వివరాలు

దారి మళ్లించిన రైళ్ల వివరాలు

వీటితోపాటు పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మద్య రైల్వే తెలిపింది. అలెప్పీ-ధన్బాద్, న్యూ జల్పాయిగురి-చెన్నై సెంట్రల్‌, సిల్ఘాట్‌ టౌన్‌-తాంబారం రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు రైల్వే తెలిపింది. ఈ షెడ్యూల్ ను ప్రయాణికులు గమనించాలని రైల్వే సూచించింది. జొవాద్ తుఫాన్ శనివారం సాయంత్రానికి బలహినపడి దిశ మార్చుకొని పయనమవుతున్నట్లు అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా కదులుతున్న తుఫాన్ బలహిన పడుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

బలహీనపడినా.. అప్రమత్తంగా

బలహీనపడినా.. అప్రమత్తంగా

జోవాద్ తుఫాన్ విశాఖకు ఆగ్నేయంగా 200 కిలోమీటర్లు, గోపాల్ పూర్ కు 310, పారాదీప్‌కు 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. హ్నానికి ఒడిశాలోని పూరీకి సమీపంలో వాయుగుండంగా మరింత బలహీన పడే సూచనలు కనిపిస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. క్రమేణా బలహీనపడుతుండటంతో… తీర ప్రాంత జిల్లాల్లు ఊపరి పీల్చుకుంటున్నాయి. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు ముప్పు తప్పినా..అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, ఒడిశా మీదుగా వెళ్లే పలు రైళ్లను ఈ రోజు వరకు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే సోమవారం నిర్వహణ పైన ఈ రోజు నిర్ణయం తీసుకోనుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com
Follow by Email
WhatsApp