gold prices today: పరుగులు పెడుతున్న బంగారం ధర.. కొండెక్కిన వెండి.. లేటెస్ట్ రేట్లు ఇవే! – gold prices today up rs 110 silver prices jump rs 1100 in ap telangana

ప్రధానాంశాలు:

  • మళ్లీ పెరిగిన బంగారం
  • వెండి కూడా ఇదే దారిలో
  • ఈరోజు రేట్లు ఇలా

బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఝలక్. పసిడి రేటు మళ్లీ పెరిగింది. బంగారం ధర ఈరోజు కూడా పైకి కదిలింది. బంగారం ధర పెరగడం ఇది వరుసగా రెండో రోజు. పసిడి రేటు బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి ధర భారీగా పెరిగింది.

హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పైకి కదిలింది. దీంతో బంగారం Gold ధర రూ.48,870కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.100 పెరుగుదలతో రూ.44,800కు ఎగసింది.

Also Read: ఈ స్కీమ్‌తో ప్రతి నెలా చేతికి రూ.2500.. ఎలా అంటే?

బంగారం ధర జిగేల్‌మంటే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఏకంగా రూ.1100 పైకి కదిలింది. దీంతో కేజీ వెండి Silver ధర రూ.67,700కు ఎగసింది. వెండి పట్టీలు, కడియాలు కొనాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు.

మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ఔన్స్‌కు 1.65 శాతం దిగొచ్చింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1768 డాలర్లకు క్షీణించింది. వెండి రేటు కూడా ఇదే దారిలో కదిలింది. ఔన్స్‌కు 0.53 శాతం క్షీణతతో 23.35 డాలర్లకు తగ్గింది.

Also Read: ఉద్యోగులకు దీపావళి బొనాంజా! 3 శుభవార్తలు?

కాగా గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి.

ఇకపోతే పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలకు వస్తు సేవల పన్ను GST (జీఎస్‌టీ), ఇతర పన్నుల, తయారీ చార్జీలు వంటివి జత చేయలేదు. అందువల్ల ఈ రేట్లకు రిటైల్ షాపుల్లో రేట్లకు వ్యత్యాసం ఉండొచ్చు. అందువల్ల మీరు ఈ విషయాన్ని గమనించాలి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com
Follow by Email
WhatsApp